Manase Pongenu Ee Vela

మనసే పొంగెను ఈ వేళా ఆ వలపే పండెను ఈ వేళా ఆ
మనసే పొంగెను ఈ వేళా ఆ వలపే పండెను ఈ వేళా ఆ
తారల దారుల వెన్నెల వాడల
తారల దారుల వెన్నెల వాడల తనువే ఊగెను ఉయ్యాలా
మనసే పొంగెను ఈ వేళా ఆ వలపే పండెను ఈ వేళా ఆ

నీల గగనాల ముంగిటా ఆణి ముత్యాల పందిటా
మంగళ వాద్యాలు మ్రోగగా నవపారిజాతాలు కురియగా
జరుగునులే మన కళ్యాణమూ పలుకునులే జీవనరాగమూ
పలుకునులే జీవనరాగమూ
మనసే పొంగెను ఈ వేళా వలపే పండెను ఈ వేళా
ఈవేళా ఆఆ ఈవేళా ఆ

పూలపానుపున నేనుంటే తలుపు మాటున నీవుంటే
చిలిపిగ నీవే నను చేరగా సిగ్గులు నాలో చిగురించగా
తొలిరేయి మనకై పెరిగేనులే కౌగిలిలో హాయి కరిగేనులే
కౌగిలిలో హాయి కరిగేనులే
మనసే పొంగెను ఈ వేళా వలపే పండెను ఈ వేళా
ఈవేళా ఆఆ ఈవేళా ఆ

సాహిత్యం: సినారె, రైతు కుటుంబం, టి చలపతిరావు,ఘంటసాల, సుశీల



Credits
Writer(s): Dr. C Narayana Reddy, T. Chalapathy Rao
Lyrics powered by www.musixmatch.com

Link