Pada Pada

పద పదమని తరిమినదే నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన ఈ సమయం
ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై
నిండిపోవా కళ్ళలోన కలవై వరమై కలవరమై
తెలియదు నాకు నీ పేరు
కాదులే మనమే వేరు

పద పదమని తరిమినదే నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన ఈ సమయం

నీటిలోన మునిగిపోని నీడల రూపం మనదేనా
గాలిలోన నువ్వు రాసే కవితలు అన్నీ చదివేనా
నిన్ను చూస్తూ కంటిపాప పుట్టిందేమో అనుకోనా
అందుకే నా రూపం తనలో కొలువై ఉంది ఎపుడైనా
తెలియదు నాకు నీ పేరు
హో కాదులే మనమే వేరు

పద పదమని తరిమినది నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన ఈ సమయం

నన్ను నేనే పోల్చుకోని అందం ఏదో నాలోన
ఎన్ని ఉన్నా నేను లేని లోటే ఉంది నీలోన
మౌనమే మన ఇద్దరి నడుమ నిచ్చెనలాగా మారెనుగా
దూరమే ఓ దారిని వెతికి నిన్నే నాతో కలిపెనుగా
తెలియదు నాకు నీ పేరు
ఓ కాదులే మనమే వేరు

పద పదమని తరిమినదే నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన ఈ సమయం
ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై
నిండిపోవా కళ్ళలోన కలవై వరమై కలవరమై
తెలియదు నాకు నీ పేరు
కాదులే మనమే వేరు

Credits
Writer(s): Abhinay Srinivas, Selva Ganesh
Lyrics powered by www.musixmatch.com

Link