Anuragame Haaratulaye

అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే
శుభమేలే నిత్యం చెంతకే వసంతం
అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే
ఆనందమే నిత్యం చెంతకే సంబరం

ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం
ప్రతి విస్తరి అక్షయపాత్రై ఆతిథ్యం
అనునిత్యం కమణీయం

అనగనగా ఒక రారాజు మదినేలే ఈ మహారాజు
నిలువెల్లా కరుణై పంచునే అమృతం
ఇలవేల్పుగ తానే ఉన్న ఒక చరితం

కలిమి చెలిమి కలిసి మెలిసి కొలువై ఉన్న నిలయం
మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం
చెల్లే కన్నకూతురల్లే ఇల్లే ఆరోప్రాణమల్లే
తలచే ధన్యజీవి ఇతడే ఇలలో
కంటిచూపే ఆనతల్లే కాలిమన్నే కుంకుమల్లే
ఊరే ప్రణమిల్లే

అనగనగా ఒక రారాజు మదినేలే ఈ మహారాజు
నిలువెల్లా కరుణై పంచునే అమృతం
ఇలవేల్పుగ తానే ఉన్న ఒక చరితం

ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం
న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే ఈ రామరాజ్యం
ముప్పేకాగ మత్తగజమే కొట్టేదాని కుంభస్థలమే
ఉగ్రసింహమల్లె నిలిచే అతడే
చట్టమైనా తప్పుచేస్తే శిక్షవేసి రక్షనిచ్చే
రాజే తానేలే

అనురాగమే అక్షతలాయే ఆ తారలే ఆహుతులాయే
గుడి వేసే బంధం జంటగా జీవితం
మొదలయ్యిన ఓ సరికొత్త కథ లిఖితం



Credits
Writer(s): Vidya Sagar, R. Ramu
Lyrics powered by www.musixmatch.com

Link