Gaganam (From "Gaganam")

ఉగ్ర రూపమై ఉరిమెను గగనం
మేఘ రుధిరమై మెరిసెను గగనం
మృత్యు శిఖరమై నిలిచెను గగనం
రగిలే గగన
గుండె పిడికిలి బిగిసిన తరుణం
కంటి రెప్పలో కదిలెను కధనం
మసిలి కుతకుత ఉడికెను హృదయం
ఎదలో మదనం
రాక్షసం వారు వేసిన పధకం
సాగనివ్వనిది నీలో నైజం
ఏది ఏమైనా దేశం కోసం
నీవే అయినావు అగ్ని క్షిపణం
ద్రోహం పామై వస్తే నలిపే పాదం నీదే
భయమే శ్వాసై కదిలే జనుల ధైర్యం నీవే
త్యాగం జెండా నీదే ధర్మం చక్రం నీవే
క్రౌర్యం జరిపే యుద్ధం గెలిచే సైన్యం నీవే నీవే

భారతదేశాన మొలిచిన రక్తం ధృడంగా ఎంచి నిలిచిన ప్రాణం
మడమతిప్పేది ఎరుగని నీలో మొదలైనది జ్వలనం
వసుధనే కాదు గగనము పైన
విషము రువ్వినది అసురుల సేన
మరుగుతున్న ఘడియలలోన పదపదముల మరణం
ధమనిలో రక్త గమనమే సైన్యం
శిలలలో ఖడ్గ భ్రమణమే శౌర్యం
జరుగుతున్న సమరములోన అణువణువొక అస్త్రం
కనులలో వేష పదమును దాచి మనసులో జాతి మహిమని నింపి
కదులుతున్న దళపతి నీలో కణ కణమొక ఖడ్గం ఖడ్గం



Credits
Writer(s): Suddala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link