Yentha Yentha Vintha

చందమామ వచ్చినా చల్లగాలి వీచినా
చిచ్చు ఆరదేలనమ్మా
(ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా)
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా
చింత తీరదేలనమ్మా
(ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా)

జంట లేదనా (అహహా)
ఇంత వేదనా (ఓహోహో)
జంట లేదనా ఇంత వేదనా
ఎంత చిన్నబోతివమ్మా

(చందమామ వచ్చినా చల్లగాలి వీచినా)
(చిచ్చు ఆరదేలనమ్మా)
(ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా)
(ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా)
ఓఓఓ మురిపాల మల్లికా
దరిజేరుకుంటినే పరువాల వల్లికా
ఇది మరులుగొన్న మహిమో
నిను మరువలేని మైకమో

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో

మరు మల్లెల సరమో
విరి విల్లుల శరమో
మరు మల్లెల సరమో
విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో

విరిసిన వనమో యవ్వనమో
పిలిచింది చిలిపి వేడుక
కిలకిల పాటగా
చలువల వరమో కలవరమో
తరిమింది తీపి కోరికా
చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో

కలలను రేపే కళ ఉంది
అలివేణి కంటి సైగలో
జిగిబిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది
సుమబాల తీగ మేనిలో
సొగసుల తావిలో

కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేలా ప్రియురాలా మణిమేఖల

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో

మరు మల్లెల సరమో
విరి విల్లుల శరమో
మరు మల్లెల సరమో
విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Madavapeddi Suresh
Lyrics powered by www.musixmatch.com

Link