Nee Chenthe Oka

నీ చెంతే ఒక చెంచిక ఉంటే వెన్నెల్లో వేట అది
నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమితో పాట అది
అదే కదా ఇది
ఔనేమో అంటోది మది
నీ చెంతే ఒక చెంచిక ఉంటే వెన్నెల్లో వేట అది
నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమితో పాట అది
అదే కదా ఇది
ఔనేమో అంటోది మది

వయసుకి వగరొస్తుంటే హొయ్
వసంతాల రాక అది

సొగసుకి చిగురొస్తుంటే హొయ్
వయ్యారాలా వేకువది

మల్లెకి సిగ్గులు పూస్తుంటే పరాగాల పాదమది
పిల్లకు తొందర పుడుతుంటే సరాగాల గారమది
అదే కదా ఇది
ఔనేమో అంటోది మది
నీ చెంతే ఒక చెంచిక ఉంటే వెన్నెల్లో వేట అది
నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమితో పాట అది
అదే కదా ఇది
ఔనేమో అంటోది మది

వెచ్చని ఊహలా వెనువెంటే
తరిమిన హేమంతమది

పచ్చని ముచ్చట మొదలెట్టే
చెలిమికి సీమంతమది

నీతో నడిపిస్తుంటే ప్రతి అడుగు సప్తపది
నీతో శ్రుతి చేస్తుంటే ప్రతి పలుకు అష్టపది
అదే కదా ఇది
ఔనేమో అంటోది మది
సారిగప సారిగప పాదపదా సదా దపపా
సారిగప సారిగప పాదపదా సదా దపపా
పద పద సద
పదస పదగరిస రిస రిదపమ గరిస
రిగమ గప



Credits
Writer(s): Vidya Sagar, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link