Gunnamavi

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట
గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

గోరువంక తన గుండె గూటిలో చిలకని దాచింది
రామచిలక ఆ గోరువంకనే కనుపాపనుకుంది
కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా
చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవ్వడాగునా
కటిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా
గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

పాడులోకం ఆ జంటను చూసి కత్తులు దూసింది
కక్ష గట్టి ఆ మనసులనిట్టే దూరం చేసింది
పంజరాలలోన పెట్టినా రామచిలక మూగబోవునా
హోరుగాలి ఎంత వీచినా ప్రేమ దీపమారిపోవునా
బ్రహ్మ రాతల్ని మార్చాలంటే మనుషుల వశమేనా
గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట
నువ్వు నేనంట...



Credits
Writer(s): Kula Sekhar, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link