Nuvvena

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
ఆ తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

ఆ కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా



Credits
Writer(s): Veturi, K.m. Radhakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link