Aaku Chatu Pinde

ఆకు చాటున పిందె తడసేనోయ్ మామ
మారుకు వేసి మరాలు చేసే గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
మావ మావ మావ
మామ మామ మామా

ఆకు చాటున పిందె తడిసిన భామ
మరాకులోన మరాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ భామ భామ
మామ మామ మామా

పందిరి నీవై తీగల్లే అల్లుకుపోని
అందాలూరే నీ పాటకు పల్లవి కాని
వేసిందమ్మ జాబిల్లి వెన్నెల ఓణి
నవ్విందమ్మ నడకలో కిన్నెరసానీ
అండ దండా నువ్వే నాకింకా కైదండలేక ఉండలేను రారా నావంకా
కొండ మల్లి పువ్వె నువ్వంట నా గుండెలోన ఉండిపోతే అంతే చాలంటా

ఆకు చాటున పిందె తడసేనోయ్ మావ
మారుకు వేసి మరాలు చేసే గారాలు చూడు మావ
నేరాలు చెయ్యి మావ
హొయ్ మావ మావ మామా
హోయ్ భామ భామ భామా

తళుకుల పుట్ట వచ్చింది తపనలు పుట్టా
కులుకుల పిట్ట నచ్చింది వదిలేదెట్టా
అక్కవ కోచ్చే అందాల చక్కని చుక్కా
చక్కెర ముద్దె ఇచ్చింది చెక్కలి నొక్కా
పట్టరాని పాలపిట్టరోయ్ పండంటి ఈడు ముట్టబోతే ముద్దు పుట్టేరోయ్
పుట్ట తేనె పట్టు పెదవెరో ఓ చిట్టి ముద్దు పెట్టకుంటే ఆగేదెట్టరో

అరె, ఆకు చాటున పిందె తడిసిన భామ
మరాకులోన మరాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ భామ భామా
మామ మామ మామా
భామ భామ భామా



Credits
Writer(s): K V Mahadevan, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link