Nuvvu Marosari

నువ్వు మరోసారి అను
మరోసారి అను చిలకా
మది వినేలాగ అను
నువ్వు మరోసారి విను
మరోసారి విను సరిగా
ఇది వెయ్యోసారి విను
మనసు తపన అదే
తలపు అదే
తెర విడి రాదేం త్వరగా
కలలుకనే కలలుకనే కల
అనుకుంటే కుదరదుగా
నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని

ఉరిమిన మేఘం తొలకరి
శ్రుతిలో పలికిందా
ముదిరిన దాహం మదువుల
నదిలో మునిగిందా
నిను తలపై నిలిపే చొరవిస్తే
శివుడైపోనా దివి చినుకా
దిగివస్తాలే సొగసిస్తాలే
నీ పెదవేలే పెదవే చాలే
నీకదే మోక్షమను సరే కాదనను

చిలిపి దుమారం చెలిమికి
బారం తెరిచిందా
వయస్సు విహారం వెతికిన
తీరం దొరికిందా
నా గెలుపే తెలిపే చిరునవై
మహ మెరిసావే మణి తునకా
సఖి సావాసం ఇక నీకోసం
ప్రతి ఏకాంతం నాకే సొంతం
తియ్యనిది ఇష్టపడి వరించాను నిను

మరోసారి అను మరోసారి అను చిలకా
మది వినేలాగ అను
నువ్వు మరోసారి విను
మరోసారి విను సరిగా
ఇది వెయ్యోసారి విను
మనసు తపన అదే తలపు అదే
తెర విడి రాదేం త్వరగా
కలలుకనే కలలుకనే కల
అనుకుంటే కుదరదుగా
నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Kalyani Malik
Lyrics powered by www.musixmatch.com

Link