Aresukoboye

సాహిత్యం: వేటూరి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నువ్వు కొంటె చూపు చూస్తూనే చలి చలి చలి చలి
హా... చలి చలి

పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరెరె అరెరె
నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుందీ హరి హరి హరి హరి
హరి హరి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె

నా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ
ఓ... నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా

నా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ
ఓ... నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా

నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
ఆ నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలిమంటకావాలీ...

నీ వింత కవ్వింతకే కాగిపోవాలీ...
నీ కౌగిలింతలోనే... దాగి పోవాలీ...

ఆరేసుకోబోయి పారేసుకున్నాను... అరె... హా... అరె... హా... అరె... హా... అరె... హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుందీ హరి హరి హరి హరి
హే... హరి హరి

నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు
ఆ... నీ రూపు నా వలపు ఏరువాక నీ కాక నీలిమబ్బు నా కోక

నే వేగి పోవాలి
నేనూగిపోవాలి
నే వేగి పోవాలి
నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలీ...

ఈ జోడు పులకింతలే నా పాట కావాలీ...
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి...

ఆరేసుకోబోయి పారేసుకున్నాను... అరె... హా... అరె... హా... అరె... హా... అరె... హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి హా... చలి చలి హా... చలి చలి
పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరెరె అరెరె
నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుందీ హరి హరి హరి హరి
హరి హరి

లాలా లాలా లాలా లాలా లల ల... లల ల... లల ల... లల ల



Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link