Idi Evvaru

ఇది ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో
తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు

పసిబిడ్డగా పుట్టి
కూతురై పెరిగి
కోడలై, భర్తకు బార్యయై
బిడ్డకు తల్లియై
ఇల్లాలిగా, తల్లిగా
తల్లికి తల్లిగా
నవ్వునూ ఏడుపును కలిపి దిగమింగి
ఇంటినే గుడిచేసిన దేవత
సెలవిమ్మని అడిగితే
ఇక సెలవిమ్మని అడిగితే
ఇది కనని వినని సంఘటన
అపూర్వ సంఘటన
ఇది ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు

భూమిపై పుట్టి
బానిసై పెరిగి
దాసియై, సేవకు నిలయమై
ఆగని యంత్రమై
నిజములో, నిద్రలో ఇల్లే కళ్ళుగా
వయసునూ సుఖమును చితిగా వెలిగించి
బ్రతుకే హారతి ఇచ్చిన దేవత
సెలవిమ్మని అడిగితే
ఇక సెలవిమ్మని అడిగితే
ఇది కనని వినని సంఘటన
అపూర్వ సంఘటన
ఇది ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో
తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు



Credits
Writer(s): Chakravarthy, Sirivennela Sitarama Sastry, Dasari Narayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link