Aho Priya (From "Bombai Priyudu")

చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్

అహో ప్రియా.
క్యా బాత్ బోల చిడియా మేరా దిల్ పిత్తర్ పిత్తర్ హోగయా
అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ
నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట
ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతేనండి
అహో ప్రియా. ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహొ అహొ అహో ప్రియా

చరణం: 1
రాగమంటు ఏమిటుంది అనురాగ మనుపాటకీ
తాళమంటు ఏమిటుంది పెనవేసుకొను ఆటకీ మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ
ముద్దు కన్న పెద్దదైన కవిత ఏముందీ
జంటకోరే గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ
కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ
అహొ అహొ అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా

చరణం: 2
తీయనైన స్నేహముందీ విరిసేటి పూలతీగలో
తీరిపోని దాహముంది తిరిగేటీ తేనే టీగలో
పూల బాల పరిమళాల కబురు పంపిందీ
తేనే టీగ చిలిపి పాట బదులు పలికింది
ఎన్ని సార్లో విన్నదైనా ఎందుకు ఎప్పుడూ కొత్తగా వుంటది
కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతీ
అహొ అహొ అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహొ అహొ అహో ప్రియా



Credits
Writer(s): M.m. Keeravaani, Sirivennala Seetharama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link