Yamunatheeram (From "Anand")

యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం

ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగా విధినైన చేసేదే ప్రేమ
హృదయంలా తననైన మరిచేదే ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధ
యమునా తీరం సంధ్యా రాగం

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిసిరంలో చలి మంటై రగిలేదే ప్రేమ
చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధ
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం



Credits
Writer(s): Veturi, K.m. Radhakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link