Srimanthuda

నిండు భూమి నిను రెండు చేతులతొ
కౌగిలించమని పిలిచినదా

(పిలుపు వినరా మలుపు కనరా
పరుగువై పదపదరా)

గుండె దాటుకుని పండుగైన కల
పసిడి దారులను తెరిచినదా

(ఋణము తీర్చే తరుణమిదిరా
కిరణమై పదపదరా)

ఏమి వదిలి ఎటు కదులుతోందొ
మది మాటకైన మరి తలచినదా

(మనిషితనమే నిజము ధనమై
పరులకై పదపదరా)

మరలి మరల వెనుదిరుగనన్న
చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా

(మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా)

లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం
ప్రేమై వర్షించనీ నీ ప్రాణం
సాయం సమాజమే నీ గేయం నిరంతరం
కోరే ప్రపంచ సౌఖ్యం నీకు గాక ఎవరికి సాధ్యం
విశ్వమంతటకి పేరు పేరునా
ప్రేమ పంచగల పసితనమా

(ఎదురుచూసే ఎదలు మీటే పవనమై పదపదరా)

లేనిదేలో పని లేనిదేలో విడమరిచి
చూడగల ఋషిగుణమా

(చిగురు మురిసే చినుకు తడిగా
పయనమై పదపదరా)

(పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా
నీలో లక్ష్యానికి జయహో
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా
నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా
జయహో జయహో)



Credits
Writer(s): Devi Sri Prasad, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link