Jatha Kalise (From "Srimanthudu")

జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే
జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చుగుద్దినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరూ
ఏ కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు

నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్నా మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు
పేరుకేమో వేరువేరు బొమ్మలే మరి
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు

ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయె నీ లోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం
నీలిరంగు తెర తీసి తొంగిచూసె ఆకాశం
చూడకుండ ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇపుడే కలిసి అప్పుడే వీరు
ఎపుడో కలిసినవారయ్యారు
ఏ కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు



Credits
Writer(s): Prasad Devi Sri, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link