Muthal Murai Unnai

కదలాడగ నువ్వే కళ్లెదుటే
కన్నీరే ఒలికెనులే
వలదన్న ఎదకే వినపడదే
అను నిత్యం నీ స్మరనే

విడువదే నా సృతి పదం
నీ తలపొక కఠిన సరం
కళహమే విధి అభిమతం
ఇది మార్చుట ఎవరి తరం

కరుగుతునే తెలి వెలుగులనీ
పంచే ఉనికి ప్రియునిదని
తెలియదు కదా ఈ ప్రియతమకి
తనిలా దివ్వయ్ కరిగెనని

లో లో బాధ అనచుకొని
చెదరని గురుతులు తలచుకొని
చెప్పే చెప్పకనే తనిలా
ఆ ఎద సడి అలజడి సంద్రమని

కదలాడగ నువ్వే కళ్లెదుటే
కన్నీరే ఒలికెనులే
వలదన్న ఎదకే వినపడదే
అను నిత్యం నీ స్మరనే

మనసుకు శాపం ఎడబాటు
అనుకుంటే మరి పొరబాటు
వదిలేసి చీకటి చాటు
ఉరికే రాదా ఉదయమెటు
కాలం కదిలి కరుగునుగా
కరగదు మనసున ప్రేమ సదా
కానారాని పాశముగా
ఇది కడనే లేనికడలి కథ



Credits
Writer(s): Bobo Sasi, Senthilkumar Saka
Lyrics powered by www.musixmatch.com

Link