Amma Aavu

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు
ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతోంది
భలేగా కొత్త చదువు చదువు
ఇలా నా ముద్దు కవిత చదువు
చెలి మురిపాల కథలు చదువు
అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు

అ ఆ ఇ ఈ అక్షరాలకు కొత్త మాటలే చెప్పనా
చెప్పుకో త్వరగా చెప్పుకో
అ అంటే నీపై అభిమానం... ఆహ
ఆ అంటే నీతో ఉంటే ఆనందం... హొ హొ హొ
ఇ అంటే ఇలలో ఇద్దరమే... అలాగ
ఈ అంటే నువ్వు నేను ఈడు జోడే
ఎంత ముద్దుగా చెప్పావు
ఎంత ముద్దుగా చెప్పావు
పిచ్చి పిచ్చిగా నచ్చావు
అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు

ఒకటి రెండు మూడు నాలుగుకు అర్థమేమిటో చెప్పనా
చెప్పుకో త్వరగా చెప్పుకో
ఒకటంటే ఒకటిగా అడుగేద్దాం... అడుగేద్దాం
రెండంటే రెండు గుండెలను ముడి పెడదాం ముడి పెడదాం
మూడంటే మూడు ముళ్ళేసి... హ్మ్ ఆ తర్వాత
నాలుగు కాలాలపాటు కలిసుందాం
అయిదు అంటే నే చెబుతాగా
అయిదు అంటే నే చెబుతాగా
నా పంచ ప్రాణాలు నువ్వేగా
అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు
ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతోంది
భలేగా కొత్త చదువు చదువు
ఇలా నా ముద్దు కవిత చదువు
చెలి మురిపాల కథలు చదువు
అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు



Credits
Writer(s): K S Chandra Bose, Rabindra Prasad Pattnaik
Lyrics powered by www.musixmatch.com

Link