Telugu Bhasha

తెలుగు భాష తియ్యదనం, తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
తెలుగు భాష తియ్యదనం, తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
Mummy, Daddy లోన ఆ మాధుర్యం ఎక్కడుంది
మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
Aunty, Uncle లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా
కొంత రుణం తీర్చరా

(మా తెలుగు తల్లికి మల్లెపూదండ)
(మా కన్న తల్లికి మంగళారతులు)

కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా
వెనక్కి తగ్గమాకురా
తెలుగు భాష తియ్యదనం, తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్ళకి తెలుగే ఒక మూలధనం
Mummy, Daddy అన్నమాట మరుద్దామురా
అమ్మా నాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా



Credits
Writer(s): Chandrabose, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link