Osari Preminchaka

ఓ సారి ప్రేమించాక
ఓ సారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓ సారి కలగన్నాక
ఊహల్లో కలిసున్నాక
విడిపోయే వీలే లేదమ్మా
నీ కళ్ళలోనా కన్నీటి జల్లుల్లోనా
ఆరాటాలే ఎగసి
అణువు అణువు తడిసి
ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా

ఓ సారి ప్రేమించాక
ఓ సారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా

అనుకోకుండా నీ ఎదనిండా
పొంగింది ఈ ప్రేమా
అనుకోకుండా నీ బ్రతుకంతా
నిండింది ఈ ప్రేమా
అనుకోని అతిధిని పొమ్మంటూ తరిమే
అధికారం లేదమ్మా
స్వార్ధం లేని త్యాగాలనే చేసేదే
ఈ ప్రేమా
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే
ఈ ప్రేమా
ఆనందం బదులు బాదే కలిగించే
ఆ త్యాగం అవసరమా

ఓ సారి ప్రేమించాక
ఓ సారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓ సారి కలగన్నాక
ఊహల్లో కలిసున్నాక
విడిపోయే వీలే లేదమ్మా

నీ కళ్ళలోనా కన్నీటి జల్లుల్లోనా
ముత్యంలాగా మెరిసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నిన్నే నడిపిందీ ప్రేమా



Credits
Writer(s): Chandrabose, Kalyani Malik
Lyrics powered by www.musixmatch.com

Link