Le Le Lele

లే లే లేలే ఇవ్వాళే లేలే
లె లే లే లేలే ఈ రోజల్లే లేలే
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

లే లే లేలే ఇవ్వాళే లేలే
లె లే లే లేలే ఈ రోజల్లే లేలే
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలై చుట్టెయ్యాలి లేలే
గోడుగల్లే పని చెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే
పడగల్లే పని పట్టాలి లేలే
నీరల్లే పారాలి, అందరి దాహం తీర్చాలి
నీరల్లే పారాలి, అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే ముంచెయ్యాలిలే
నేలల్లే ఉండాలి, అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలే చూపాలే

లే లే లేలే ఇవ్వాళే లేలే
లె లే లే లేలే ఈ రోజల్లే లేలే

చెడు వుంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది
చెడ్డోళ్ళకి చెడు చెయ్యడమే మంచి
చేదుంది తీపి భేదం వేరే ఉంది
చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది
ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది
ఎటుకైనా గమ్యం ఒకటేలే
బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది
చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే

లె లే లే లేలే ఇవ్వాళే లేలే
లె లే లే లేలే ఈ రోజల్లే లేలే
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link