Aey Pilla

ఏయ్ పిల్లా ఏం చేద్దాం చెప్పు
ఏదో చేసెయ్ అది మాత్రం తప్పు
ఏయ్ పిల్లా ఏంటమ్మా తప్పు
ఏయ్ అబ్బాయ్ అడగద్దు ఆ అప్పు
ఏ ఏ కన్నేసా కోనేట్లో ఆడేసా అందాలలో చాలీసా
కోయ్ కోయ్ అబ్బాయి లేలేత సొరకాయి
బోర్లిస్తా బొప్పాస్కాయి
చుమ్మా చుమ్మా చుమ్మా నువ్వు దాచలేవు సుమ్మా
అమ్మా అమ్మా ఆశ అది నీ అత్తగారి సొమ్మా
చుమ్మా చుమ్మ చుమ్మ చుమ్మా నువ్వు దాచలేవు సుమ్మా
అమ్మా అమ్మ అమ్మ ఆశ అది నీ అత్తగారి సొమ్మా
ఏయ్ పిల్లా ఏం చేద్దాం చెప్పు
ఏదో చేసెయ్ అది మాత్రం తప్పు
ఏయ్ పిల్లా ఏంటమ్మా తప్పు
ఏయ్ అబ్బాయ్ అడగద్దు ఆ అప్పు

ఆ భీమిలిలో ప్రేమలీల ఎన్నడో
ఓ ఫ్యామలీగా రాసలీల ఎప్పుడో
నే పక్కకొస్తే నీకు ఎంత తిక్కరో
నీ ముద్దుగాలి సోకితేనే చక్కరో
అందాలు మాట్లాడు అమ్మాయ్ ఒళ్ళంతా
హత్తుకుంటే హాయి కంటే తీపి తుళ్ళింత
ఆరాలు తీసేటి అబ్బాయ్ కళ్ళంతా
బేరానికొస్తాయి అమ్మాయ్ కాళ్ళంటా
ఏయ్ పిల్లా ఏం చేద్దాం చెప్పు
ఏదో చేసెయ్ అది మాత్రం తప్పు
ఏయ్ పిల్లా ఏంటమ్మా తప్పు
హె ఏయ్ అబ్బాయ్ అడగద్దు ఆ అప్పు

నే చాకులాంటి సోకులున్న పిల్లని
నా సోకు కింద పైటచాటు ఉండని
ఏం చెప్పుకున్నా తీరదే ఈ దప్పిక
నువ్ ఒప్పుకుంటే తప్పులేదే గోపిక
రేపొచ్చి కనిపించు రెండో కృష్ణయ్యా
ఈలకైనా లీలకైనా వేళ ఉందయ్యా
కోనేటి కెరటాల కోలాటాలమ్మా
నీటికోక కట్టుకోక బెట్టు ఏలమ్మా
ఏయ్ పిల్లా ఏం చేద్దాం చెప్పు
ఐతే చెప్పు కాఫీ ఓ కప్పు
ఏయ్ ఒళ్ళు ఎట్టుందో చెప్పు
ఎట్టా ఉన్నా ఉడకదులే నీ పప్పు
ఏ ఏ కన్నేసా కోనేట్లో ఆడేసా అందాలలో చాలీసా
కోయి కోయి అబ్బాయి లేలేత సొరకాయి
బోర్లిస్తా బొప్పాస్కాయి
చుమ్మా చుమ్మా చుమ్మా నువ్వు దాచలేవు సుమ్మా
అమ్మా అమ్మా ఆశ అది నీ అత్తగారి సొమ్మా
చుమ్మా చుమ్మ చుమ్మ చుమ్మా నువ్వు దాచలేవు సుమ్మా
అమ్మా అమ్మ అమ్మ ఆశ అది నీ అత్తగారి సొమ్మా



Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link