Pralayama Nee

ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్ట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్ట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రేమ కవితా గానమా నా ప్రాణమున్నదీ శృతి లేదా
గేయమే యద గానమైనది వలపు చితిని రగిలించగా
తీగ చాటున రాగమ ఈ దేహమునంది జతలేకా
దాహమారని స్నేహమై యద శిధిల శిశిరమై మారగా
ఓ హృదయమా.
ఇది సాధ్యమా...
రెండుగ గుండె చీలునా.
ఇంక ఎందుకు శోధన
ఇంక ఎందుకు శోధన
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్ట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రేమ సాగర మధనమే జరిగింది గుండెలో ఈ వేళ
రాగమన్నది త్యాగమైనది చివరికెవరికి అమృతం
తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ
అశ్రుధారలే అక్షరాలుగా అనువదించే నా జీవితం
ఓ ప్రాణమా.
ఇది న్యాయమా...
రాగం అంటే త్యాగమా
వలపుకు ఫలితం శూన్యమా
వలపుకు ఫలితం శూన్యమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్ట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా



Credits
Writer(s): M. M. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link