Naa Paata

నా పాట తేట తెలుగు పాట

నా పాట తేనెలొలుకు పాట

నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట

లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట
పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట
చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట
పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట
అందరు మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట

అందరు మెచ్చే పాట ఒకరికి అంకితమిచ్చే పాట
పదాలు అన్నీ బోయీలై ప్రేమ పల్లకిని మోసే
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట

నీస గాస నిసగా
దమద మగమ
సగస గమగ మదమ దనిద నిస నిసమగస దనిస

పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట
కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట
నదులలోని జీవరాగమే నింపుకున్న పాట
వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట
ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట
ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట
మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసే
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట



Credits
Writer(s): Chandrabose, S.v.krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link