Aakasham Digivachi

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం
మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా
దితక దితక దింతక తకజిం దితక దితక దింతక తకజిం
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం
మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

Credits
Writer(s): S R Koteswara Rao, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link