Allah

అల్లా
శ్రీరామా

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
కళ్యణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడూ
అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనందనందనుడు అమృతరసచెందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామ నామాంమృతం
ఆ నామమే దాటించు భవసాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవు మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి, ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి
తాగరా, తాగరా శ్రీరామ నామాంమృతం
ఆ నామమే దాటించు భవసాగరం

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ
శ్రీ రామ
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమ
కోదండ రామ
మపనిసరి సాని పానీ పామ
సీతారామ
మపనిసరి సారీ సరిమరిస నిపమ
ఆనంద రామ
మా మా రిమరిమరి సరిమ
రామ జయ రామ
సరిమా
రామ
సపమా
రామ
పావన నామ

ఏ వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలనుకల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు
తాగరా, తాగరా శ్రీరామ నామాంమృతం
ఆ నామమే దాటించు భవసాగరంCredits
Writer(s): Youssou N'dour, Kabou Gueye
Lyrics powered by www.musixmatch.com

Link