Sannayi Mogindi

సువ్వి కస్తూరి రంగ సువ్వి
కావేటి రంగ సువ్వంటూ దంచండమ్మ పసుపు కొమ్ములు
సువ్వి కళ్యాణ రంగ సువ్వి
కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చెవుల కమ్మలు
ఆహుం ఆహుం ఆహుం ఆహుం
తీగె నడుములూగంగ
పడుచు ముత్తైదువలు వంగి వంగి పోటెయ్యండి వెండి రోకళ్ళు
పూల బుట్టలు దాచే పట్టు జాకెట్టు చమట పట్టుతుంటే ఊరించాలి మగాళ్ళ కళ్ళు
ఆహుం ఆహుం
సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి

సన్నాయి మోగింది పెళ్ళి పందిట్లో
అమ్మాయి కళ్ళలో ఎన్ని ముచ్చట్లో
సన్నాయి మోగింది పెళ్ళి పందిట్లో
అమ్మాయి కళ్ళలో ఎన్ని ముచ్చట్లో
గోరింట పూసింది పిల్ల దోసిట్లో
ఊరంతా చేరింది పెళ్ళి ముంగిట్లో
సన్నాయి... సన్నాయి మోగింది పెళ్ళి పందిట్లో
అమ్మాయి కళ్ళలో ఎన్ని ముచ్చట్లో

నీ ఎద మురిపెము తీరుటకే ఈ చిలకల పందిరిలో
ఏడడుగుల పండుగలో (ఏడడుగుల పండుగలో)

ఈ నునుసిగ్గులు ఉండవులే తన వెచ్చని మచ్చికలో
తొలి రాతిరి కౌగిలిలో (తొలి రాతిరి కౌగిలిలో)

అటు ఇటు అతిథులు పెద్దల్లారా స్వాగాతాలండి
రండి కూర్చోండి
మీ మీ నోళ్ళను ఊరించే టిఫినీలు చేయండి
కాఫీలు తాగండి
మీ ప్రేమ దీవెనెలే శ్రీరామ రక్షండి
సన్నాయి మోగింది పెళ్ళి పందిట్లో
అమ్మాయి కళ్ళలో ఎన్ని ముచ్చట్లో

ఓ మనసెరిగిన మా మరిది మరుమల్లిక బాలికతో
పూబంతులు ఆడవయా (పూబంతులు ఆడవయా)

మా చెలి బెదరని పెదవులలో చిరు లవంగ మొగ్గలను
మునుపంటితో లాగవయా (మునుపంటితో లాగవయా)

ఇత్తడి బిందెలో ఉంగారాన్ని ఎవరందుకుంటారో (ఎవరందుకుంటారో)
గిలి గిలిగింతల అల్లరులన్నీ గిల్లుకుంటారో
తెగ నవ్వుకుంటారో
ఈ నవ్వులే నూరేళ్ళు మిము కాపు కాయాల

ఇపుడే మా కంటి దీపం నీ ఇంటి వెలుగైయ్యింది
ఎపుడూ నీ తోడు నీడై నీవెంటే తానుంటుంది
ఈ చేయే నీవందుకో, నీ గుండెలో చేర్చుకో

అవుతున్నా నేనిక దూరం
కావాలి నీవింక ప్రాణం
రావాలి నీతోనే
తన తీపి కల తీరు కాలం
ఈ చేయే నీవందుకో, నీ గుండెలో చేర్చుకో



Credits
Writer(s): M.m. Keeravani, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link