Meghaallo

మేఘాల్లో సన్నాయిరాగం మోగింది
మేళాలు తాళాలు వినరండి
సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అనరండి

అచ్చతెలుగింట్లో పెళ్ళికి అర్ధం చెప్తారంటూ
మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ
జనులంతా జైకొట్టేలా జరిపిస్తామండి

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓ రమణి

ఇంతవరకెన్నో చూశాం అనుకుంటే సరిపోదుగా
ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా
ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా
కాస్తైనా కంగారు ఉంటుందిగా

నీకైతే సహజం తియ్యని బరువై సొగసించే బిడియం
పనులెన్నో పెట్టి మా తలలు వంచిందే ఈ సమయం
మగాళ్లమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం
ఘనవిజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓ రమణి

రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక
రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా
ఏమాత్రం ఏచోట రాజీపడలేక

చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చమర్చేలా
గిట్టనివాళ్లైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా
కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓ రమణి



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link