Bodi Chadhuvulu

బోడి చదువులు waste-u
నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడి చూడు cricket-u
టెండుల్కర్ అయ్యేటట్టు

బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు
ఒక్క pose-u కొట్టు లక్షలు వచ్చిపడేటట్టు
అడిడాసు bootలు తొడగవ నీకు ఆరు కోట్లు
ఎంత చదివితే సంపాదిస్తవు అంత పెద్ద అంతస్తు
ఓరి innocent-u student-u

బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు

చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుంద నీ జుట్టు
థార్ ఎడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ
వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెపుడో నాటిన చెట్లు
పాత dateలు బట్టీ వేస్తూ అసలేంటీ కుస్తీ పట్లు
IQ అంటే అర్థం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు
ఆడే పాడే ఈడుని దానికి పెట్టకు తాకట్టు
పనికిరాని చెత్తంతా నింపకు మెదడు చెదలు పట్టు
ఓరి innocent-u student-u

బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు

ఇదిగో, leak-u వీరులకు ముందే తెలుసు question paper గుట్టు
లోక జ్ఞానం కలిగిన వాడే coaching centre పెట్టు
బాబూ, mark-uల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ scientist
గుర్తుపట్టర ఏ రంగంలో ఉందో నీ interest-u
నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక talent-u
నీకు నువ్వు boss అవ్వాలంటే దాన్ని బయట పెట్టు
Race-u horse-uవై life-uను గెలిచే పరుగు మొదలుపెట్టు
ఓరి innocent-u student-u

బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు

రెండో ఎక్కం రాకపోయినా నీకేమిట్రా లోటు calculator చేపట్టు, don't worry
Bill-u కడితే నీ bedroomలో వేస్తాడు బాసింపెట్టు సాక్షాత్తూ బిల్ గేట్సు
పిచ్చోడెవరో జుట్టుని పీక్కుని ఎన్నో కనిపెట్టు
పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు
చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి come అంటూ
సలహా ఇస్తున్నానని అనుకుంటే అదే wrong route-u
బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు
ఓరి innocent-u student-u

బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు

Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link