Pallakilo Pelli Koturu - From "Pallakilo Pelli Koturu"

చంపకి చుక్కను పెట్టి
పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి
కస్తూరి నుదుట దిద్ది
ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో

పల్లకిలో
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది

రాణి గారికి సిగ్గుల వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే
(పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది)

మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మ
(బంగరు బొమ్మ బంగరు బొమ్మ)
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ
(వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ)
పరిమళాల గంధపు బొమ్మ
సున్నితాల గాజు బొమ్మ
పుట్టినింట లేత బొమ్మ
మెట్టినింట సీత బొమ్మ
ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో
మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము

(పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది)

నా పెళ్ళిలో అతిథులు మీరే కదా

అతిథులంటే దేవుళ్ళనే అర్ధం కదా

ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది
నాపై మీ చల్లని చూపే వరముల వరదయ్యింది
ఈ అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యాంగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలని
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link