Keeravani (From "Anveshana")

సా ని స రి సాని
సా ని స మ గా మరి
ప ద సా ని స రి సాని
సా ని సమ గా మరి
ప ద సస ని రిరి స గగ గరి మమ గగ మా
సా ని ద ప మ గ రి స ని

కీరవాణీ, చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా
విరబుసిన ఆశలు విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన రుతువుల తడిసిన
మధురస వాణి, కీరవాణీ
చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా

గ రి స ప మ గ పా ని
స రి గ రి గ స ని స

ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా

నీ గగనాలలో నే చిరు తారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే

కీరవాణీ, చిలకల కల కల పాడలేదు వలపులే తెలుపగా
ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపులా
అలిగిన మంజులవాణీ, కీరవాణీ
చిలకల కల కల పాడలేదు వలపులే తెలుపగా

నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై

నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడుచుల మనసులు పంజర
సుఖముల పలుకులు తెలియకనే

కీరవాణీ, చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగ

విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన రుతువుల తడిసిన
మధురసవాణీ, కీరవాణీ
చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగాCredits
Writer(s): Veturi, Ilayaraja
Lyrics powered by www.musixmatch.com

Link