Ninna Monna Maatho

నిన్నా మొన్నా మాతోపాటే
ఆడిన అల్లరి పిల్లకి
వేరే చోటికి వెళ్లాలంటూ
వచ్చేసింది పల్లకి
కొత్త పెళ్లి కూతురా
ఎందుకంత తొందరా
దారి చూపక చేరాడు
నువ్వు కోరుకున్న చెలికాడు

నిన్నా మొన్నా మాతోపాటే
ఆడిన అల్లరి పిల్లకి
వేరే చోటికి వెళ్లాలంటూ
వచ్చేసింది పల్లకి

రంగుల కలలతో మంగళ స్నానం
చేసిన సొగసుల కలలుకని
ముంగిట నిలచిన మంచి ముహూర్తం
రాసిన లేఖలు చదువుకొని
ఎటో ఉన్న స్వర్గాలన్నీ
దిగొచ్చాయి నీకోసం
సఖీ నీకు స్వాగతమంటూ
అందించాయి ఆహ్వానం
పువ్వుల మేనాలో
నవ్వుల వీధుల్లో
దారి చూపగ చేరాడు
నువు కోరుకున్న చెలికాడు

నిన్నా మొన్నా మాతోపాటే
ఆడిన అల్లరి పిల్లకి
వేరే చోటికి వెళ్లాలంటూ
వచ్చేసింది పల్లకి

రేపటినుంచి ఊసులు ఏవి
మా చెవిలో నువు చెప్పవని
కోపంగానే ఉన్నాగాని
నవ్వుతూ ఉన్నాం తప్పదని
వరాలన్ని నిన్నే వలచి
వరించాయి చిలకమ్మా
తదాస్తంటూ దేవతలొచ్చి
దీవిస్తారు లేవమ్మా
నిత్య సుమంగలిగా నిను నడిపించంగా
దారి చూపగ చేరాడు
నువు కోరుకున్న చెలికాడు

నిన్నా మొన్నా మాతోపాటే
ఆడిన అల్లరి పిల్లకి
వేరే చోటికి వెళ్లాలంటూ
వచ్చేసింది పల్లకి
కొత్త పెళ్లి కూతురా
ఎందుకంత తొందరా
దారి చూపక చేరాడు
నువ్వు కోరుకున్న చెలికాడు



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link