Neevega Na Pranam - From "O Papa Lali"

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీతోడే నా లోకం అంట
నీ నీడగా నే సాగేనులే నీ వెంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

వెల్లివిరిసే వెన్నెలల్లె విరుల గంధం నేడు కావే
ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే
పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే
పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు, విన్నానే
కలిసేనులే నే కరిగేనులే నీలోన
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

కంటి వెలుగై నిలిచిపోనా, మనసులోన నిండిపోనా
కలలలోని కథను నేనై చివరి వరకు తోడు రానా
స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నీవు ఉంటే అంతేగా
నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే
నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడు
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీ నీడగా నే సాగేనులే నీ వెంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link