Mavayya Anna Pilupu

పుల్ల మావిళ్ళు కోరి పిల్ల వేవిళ్ళకొచ్చే ఒళ్ళో చలివిళ్ళు పెట్టరే
తానా తందాననానా తానా తందాననానా తానా తందాననానా
మల్లె పందిళ్ళు వేసి, తల్లో జాజులు పెట్టి, కొత్త గాజులు వెయ్యరే
తానా తందాననానా తానా తందాననానా తానా తందాననానా

అ... మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా కంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
(తందన తందానా తందన తందానా తందన తందానా తందన తందానా)
(తందన తందానా తందన తందానా తందన తందానా తందన తందానా)

అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా
నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా
అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించిచాడు... అన్నీ తానైనాడు
తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

(పట్టుచీర గట్టి సారె పెట్టరే)
(దిష్టి చుక్క పెట్టి హారతివ్వరే)
(అందాల కొమ్మ నీళ్ళాడునమ్మ, అక్షింతలేసి దీవించరమ్మ)

ఆరేడు మాసాలు నిండగా ఈ అన్నయ్య కలలన్ని పండగా
తేవాలి బంగారు ఊయల, కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా, పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా నీ పాపకు జోల పాడనా
ఇది అరుదైన ఓ అన్న కథ
ఇది మురిపాల ఓ చెల్లి కథ
ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా కంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

Credits
Writer(s): K V Mahadevan, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link