Chandamama

చందమామ కథలో చదివా
రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాలమిత్ర కథలో చదివా
పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ
పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాటలోన రతనాల తోటలోన
వజ్రాల మేడలోన బంగరు గదిలోన
విరి తేనెల్లో పాలల్లో తానాలాడేసి
నెల వంకల్లో వెన్నెల్నే భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
ముద్దుల్లోన ముద్దవుతాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
చందమామ కథలో చదివా
రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అహ కళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో

నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link