Vayasa Chusuko

వయసా చూసుకో, చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో, వరసే అందుకో, నీకిది తొలి గీతం
ఆగనన్నది ఆశ, ఎందుకో తెలుసా
ఓ... ఊహకందని భాష, నేర్చుకో మనసా
ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా
నా సితారా ప్రేమంటే ఇది రా...
వయసా చూసుకో, చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో, వరసే అందుకో, నీకిది తొలి గీతం

రేయిభారం రెట్టింపయ్యిందీ
లే వయ్యారం నిట్టూరుస్తుందీ
రాయభారం కొట్టేచెప్పిందీ
హాయ్ బేరం గిట్టేలా ఉందీ
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదేరా
వయసా చూసుకో, చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో, వరసే అందుకో, నీకిది తొలి గీతం

తేనె మేఘం కాదా నీదేహం
వానరాగం కోరే నా దాహం
గాలివేగం చూపే నీ మోహం
తాకగానే పోదా సందేహం
ప్రాణముందీ ప్రేమంటే ఇదేరా
ప్రాయముందీ ప్రేమంటే ఇదే

వయసా చూసుకో, చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో, వరసే అందుకో, నీకిది తొలి గీతం
ఆగనన్నది ఆశ, ఎందుకో తెలుసా
ఆ... ఊహకందని భాష, నేర్చుకో మనసా
సామిరారా ప్రేమంటే ఇదేరా
నా సితారా ప్రేమంటే ఇది రా...
వయసా చూసుకో, చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో, వరసే అందుకో, నీకిది తొలి గీతం



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link