Vu Anna Aa Annaa - From "Daari Thappina Manishi"

ఊఁ అన్నా ఆఁ అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు
ఊఁ అన్నా ఆఁ అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు
ఉన్న తలపు వలపైనప్పుడు కన్నె మనసు ఏమంటుంది
చిలిపి చిలిపి కులుకుల కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది
కోరికలన్నీ కోయిలలైతే కొత్త ఋతువు ఏమంటుంది
వయసంతా వసంతమై వలపు వీణ ఝుమ్మంటుంది
పిలుపో తొలి వలపో మరుపో మైమరుపో
ఊఁ అన్నా ఆఁ అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

ఉన్న కనులు రెండే అయినా కన్నకలలకు అంతే లేదు
కన్న కలలు ఎన్నైనా ఉన్న నిజము మారిపోదు
కోరిన వారు కొంగు ముడేస్తే కలలు పండి నిజమౌతాయి
కల అయినా నిజమైనా కలదు కదా కథ తరువాయి
కలయో ఇది నిజమో కథయో వైష్ణవమాయో
ఊఁ అన్నా ఆఁ అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు
నిదురించిన తూరుపులో నీవేలే పొద్దుపొడుపు
నిను కోరిన నా తలపులలో నీకేలే ముద్దుల ముడుపు
అన్నా నేవిన్నా ఔనన్నా కాదన్నా
అవునంటే నీతో ఉన్నా కాదన్నా నీలో ఉన్నా
ఊఁ అన్నా ఆఁ అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు
ఆహాహాహహా ఆహాహాహహా

Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Vijaya Bhaskar
Lyrics powered by www.musixmatch.com

Link