Nidduraporaasami

నిద్దుర పోరా సామీ
అహ నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ
చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక నిద్దుర పోరా సామీ

మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ
జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ
మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ
జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ
హోయ్ చందుర్రూనీ సూపుతగిలి కందిపోతావేమెూ
హోయ్ చందుర్రూనీ సూపుతగిలి కందిపోతావేమెూ
ఈ సిన్నదానీ సెంగుమాటున మెూము దాచి ఆదమరచి
నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ
చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక నిద్దుర పోరా సామీ

గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే
కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే
గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే
కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే
పండువెన్నెలా పాల నురుగుల పానుపేసీ పిలుస్తుంటే
పడుచుదనమే పిల్లగాలికి పడగెత్తీ ఆడుతుంటే
నిద్దుర పోనా పిల్లా ఆ నిద్దుర పోనా పిల్లా నా ముద్దూ మురిపాల పిల్లా
చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక నిద్దురపోనా పిల్లా
హో నిద్దురపోనా పిల్లా

సాహిత్యం: సి నారాయణ రెడ్డి: యస్పిబాలు, జానకి



Credits
Writer(s): Dr. C Narayana Reddy, T.v. Raju
Lyrics powered by www.musixmatch.com

Link