buggey Bangarama

పచ్చి పాల యవ్వనాల గువ్వలాట
పంచుకుంటే రాతిరంతా జాతారంట

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మ
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ
పట్టు చీరల్లో చందమామ
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ
కన్నె రూపాన కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మ
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మ
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ

ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం చెలికే స్వంతం... వసంతం
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారం
పుష్య మాసాన మంచు నీవో
భోగి మంటల్లో వేడి నీవో
పూల గాంధాల గాలి నీవో
పాల నురగల్లో తీపి నీవో
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మ

Here we go నాగ మల్లి పూలతోన నంజుకున్న ముద్దులారా
సందె గాలి కొట్టగానే ఆరుబయిట ఎన్నెలింట సద్దు కున్న కన్నె జంట సద్దులాయెరో
Yo! నారు మల్లె తోట కాడ నాయిడోరి ఎంకి పాట
నాగ మల్లి పూలతోన నంజుకున్న ముద్దులారా
సందె గాలి కొట్టగానే ఆరుబయిట ఎన్నెలింట సద్దు కున్న కన్నె జంట సద్దులాయెరో

ఎదలో జరిగే విరాహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం ఎపుడో
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే
అన్ని రంగుల్లో ఆమె రూపే
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే
నన్ను మొత్తంగా మాయ చేసే
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మ
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ
పట్టు చీరల్లో చందమామ
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ
కన్నె రూపాన కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మ

Credits
Writer(s): Peddada Murthy, K.m.radha Krishnan
Lyrics powered by www.musixmatch.com

Link