Goruvanka Valaga

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింట చిందులేసి
అందమైన బాలుడే తనవాడై

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా

ఏటి మనుగడ కోటి అలలుగ
పొంగు వరదల వేగాన
పడిలేచు అలలకు తీపి కలలకు
లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిలా పడ్డట్టున్న
అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మ
అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో
ఎవరికి వారే యమునకు మీరే
రేవు నీరు నావదంట
నావ తోడు రేవుదంట పంచుకుంటే

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన
తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన
పాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఏరు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే
పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పోద్దుల్లో
పరవశమేదో ఓ పరిమళమాయే ఓ
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింట చిందులేసి
అందమైన బాలుడే తనవాడై



Credits
Writer(s): M. M. Keeravani, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link