Chilaka Ye Thodu Leka

చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక

చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

గోరింకా ఏదే చిలక లేదింక
గోరింకా ఏదే చిలక లేదింక

బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే

అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే

చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

కొండంత అండే నీకు లేదింక
కొండంత అండే నీకు లేదింక

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో

ఆనందం కొనలేని ధనరాశితో
అనాధగా మిగిలావే అమావాసలో
తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా

చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక



Credits
Writer(s): S.v. Krishna Reddy, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link