Chita Pata

చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా
చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా
చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా
ఎగబడి దిగబడి మగసిరి కలబడి ఆలిగిన అందాలిక నీవే పదమంట
చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా

నీ జంట జంపాలా తనువులు కలబడి తపనలు ముదరగనే
నీ చూపులియ్యాల పెదవుల ఎరుపుల తొలకరి చిలికెనులే
తెలిమబ్బో చెలి నవ్వో చలి గిలకలతో పలికెనులే గిలిగిలిగా
హరివిల్లో కనుచూపో తడి మెరుపులతో తడిమెనులే చలిచలిగా
మెచ్చి మెలిపెడతా గిచ్చి గిలిపెడతా
పచ్చి పడుచుల వలపుల చిలకలా పిలపిల పలుకుల
బుడిబుడి కులుకుల బుడిబుడి నడకలు వెంటాడు వేళల్లో

చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా

నా మల్లె మరియాద మడిచిన సొగసుల విడిచిన ఘడియలలో
నీ కన్నె సిరి మీద చిలకల పలుకుల అలికిడి తళుకులలో
పసిముగ్గో కసిబుగ్గో చలి చెడుగులలో చెరి సగమై అడిగెనులే
అది ప్రేమో మరి ఏమో యమ గిలగిలగా సలసలగా తొలిచెనులే
చేత చేపడతా చెంగు ముడిపెడతా
చెంప తళుకులు కలిసిన మెరుపులు దులిపిన ఒడుపున
తడిమిన సొగసుల తొడిమల తొణికిన అందాల వేటల్లో

చిటపట చిటపట
కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట
తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా
చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా
చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా
ఎగబడి దిగబడి మగసిరి కలబడి ఆలిగిన అందాలిక నీవే పదమంట

చిటపట చిటపట
కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట
తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా

Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link