Hulala - From "Express Raja"

ఓహో హో ఓహో హో
నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకేనే
నీ శ్వాసే వెచ్చని చలి మంటై దూరమే కాలెనే
కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే
చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే
హుళాల ల ల నీతో హుళల నీ వల్లే హే హే గాల్లో తేలేలా
హుళాల ల ల నీతో హుళల నీ వల్లే ఈ హాయి హుళాలా

తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేశా
దూరమేసి ద్వేషమేసి నిన్నెలా నే మరిచానే
కలవని పదం కలిసింది మనస ముగియని కథై నిను చేరు వరస
ఊపిరి సగం నీకోసమేగా నీలోని సంతోషం నాలో సంగీతం
హుళాల ల ల నీతోనే హుళల నీ వల్లే ఏ ఏ మేఘాల్లో తేలేలా
హుళాల ల ల నే నీతో హుళల నీ వల్లే ఈ హాయే హుళాలా

ఓహో మామ మియా ఓహో మామ మియా ఓహో మామ మియా ఏ ఏ ఏ
ఓహో మామ మియా ఓహో మామ మియా ఓహో మామ మియా ఏ ఏ ఏ

కలల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగీ నువ్వే
నాకు తెలిసి నన్ను కోరే ఆడపిల్లవు నువ్వేలే
కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే
కలలకు ఇక ప్రతి రోజు సెలవే నీడల్లే ప్రేమల్లె నాతో నువ్వుంటే

ఓ హుళాల ల ల నీతో హుళల నీవల్లే హే హే గాల్లో తేలేలా
హుళాల ల ల నీతో హుళల నీవల్లే ఈ హాయే హుళాలా



Credits
Writer(s): Praveen Lakaraju, Sri Mani
Lyrics powered by www.musixmatch.com

Link