Bhale Bhale Andalu

ఆ నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి
మరచితివో మానవ జాతిని దయమాలి

బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు

మాటలు రాని మృగాలు సైతం మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి మారణ హోమం సాదించేను
మనిషే పెరిగి మనసే తరిగి
మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు...

బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు

ఆ ఆ... చల్లగ సాగే చలయేటివోలే మనసే నిర్మలమై వికచించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి...

బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, P. Adinarayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link