bhama bhama

భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు

హొయ్ భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పన్నీరు ఐపోతావా అల్లుడు
ముద్దు కావాలి
హత్తుకోవాలి
సిగ్గుపోవాలి అగ్గిరేగాలి... ఏం చేస్తావో చెయ్యి
భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ బావా బావా పన్నీరు ఐపోతావా అల్లుడు

ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా
వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటు గుబులెట్టేస్తావా సారంగా
వ్యవహారంగా మమకారంగా నిను చుట్టేస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

అబ్బోసి సొగసొగ్గేసి మహ చెలరేగావే లైలేసి
నిను చూసి తెగ సిగ్గేసి తలవంచేశా మనసిచ్చేసి
చుట్టేసి పొగబెట్టేసి నను లాగేశావే ముగ్గేసి
ఒట్టేసి జత కట్టేసి వగలిస్తానయ్యో వలిచేసి
ఒసోసి మహముద్దసి మతిచెడ గొట్టావే రాకాసి
ఎదో చేసి పొగమందేసి నను కాపాడయ్యో దయచేసి
భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు

హొయ్ హొయ్ హొయ్ అరె భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పన్నీరు ఐపోతావా అల్లుడు
ముద్దు కావాలి హొయ్ హొయ్
హత్తుకోవాలి హయ్ హయ్
సిగ్గుపోవాలి అగ్గిరేగాలి... ఏం చేస్తావో చెయ్యి
భామా భామా డడడ డండారాయ్ అమ్మడు
బావా బావా పన్నీరు ఐపోతావా అల్లుడు
అరె భామా భామా డడడ డండారాయ్ డండర జింతాతనుక్కుతా
బావా బావాCredits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link