Aaraneekuma Ee Deepam

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
ఇదే సుమా నా కుంకుమతిలకం ఇదే సుమా నా మంగళసూత్రం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

ఇంటిలోన నా పాప రూపున గోరంతదీపం
కంటికెదురుగా కనబడువేళల కొండంతదీపం
నా మనస్సులో వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆకాశాన ఆ మణి దీపాలే ముత్తైదువులుంచారో
ఈ కోనేట్లో ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో
ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై యుండే
దేవికి పట్టిన హారతులే
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
నా నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎచటైనా ఎప్పుడైనా నే కొలిచే కళ్యాణదీపం నే వలచే నా ప్రాణదీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం



Credits
Writer(s): Sathyam, Devulapalli Krishna Sastry
Lyrics powered by www.musixmatch.com

Link