Andaala Pasipaapa - Version 1

అందాల పసిపాప, అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కధలెన్నో చెపుతాలే, కలలన్ని నీవేలే...
అందాల పసిపాప, అందరికి కనుపాప

మీ నాన్న వస్తున్నారు యేమేమో తెస్తున్నారు
మీ నాన్న వస్తున్నారు యేమేమో తెస్తున్నారు
వంశం నిలిపే తొలి కానుపువని
వంశం నిలిపే తొలి కానుపువని, గారబాలే కురిపించేరు
అందాల పసిపాప, అందరికి కనుపాప

మా ఇద్దరి ముద్దుల రాజా, నా మదిలొ పూసిన రోజా
మా ఇద్దరి ముద్దుల రాజా, నా మదిలొ పూసిన రోజా
ఇంతై అంతై ఎంతో చదివి, ఇంతై అంతై ఎంతో చదివి,
నీ వన్నిట నాన్నను మించాలి...

అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు
అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు
రవ్వలవంటి నీ పిల్లలను రవ్వలవంటి నీ పిల్లలను
అమ్మను నేనై ఆడిస్తాను
అందాల పసిపాప, అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కధలెన్నో చెపుతాలే, కలలన్ని నీవేలే...
లల లలె లలలి లల లలె లలలి

సాహిత్యం: దాశరథి: చిట్టి చెల్లెల్లు: సాలూరి రాజేశ్వరరావు: పి. సుశీల

Credits
Writer(s): Dasarathi, S Rajeshwara Rao
Lyrics powered by www.musixmatch.com

Link