Ee Reyi Theeyanidhi

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

ఆ ఆ ఆ ఆ
పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగా నును మేని తీగ పులకించిపోయెను తొలకరి వలపుల

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపే
నీ నీడ నిలిపే
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
మ్మ్ మ్మ్ హు హు మ్మ్ మ్మ్ హు హు
మ్మ్ మ్మ్ హు హు మ్మ్ మ్మ్ హు హు



Credits
Writer(s): Dr. C Narayana Reddy, S Rajeshwara Rao
Lyrics powered by www.musixmatch.com

Link