Om Om Ayyappa

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
సహస్రారమే శబరి శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం
సహస్రారమే శబరి శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

ధనుష్కోటికి ఆదిమూలమై ఉన్నది మూలాధారం
అది గణపతికే ప్రాకారం
ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీ కాళహస్తి క్షేత్రం
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

లింగాంగభుల పానబట్టమే వెలిగే స్వాధిష్ఠానం
ఇది బ్రహ్మకు మూలస్థానం
కాలైకట్టి అనుక్షేత్రం జంభుకేశ్వరం ఈ తీర్థం
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

అరుణాచలమై వెలిగేది
రుణపాశాలను త్రెంచేది
పృథ్విజలమ్ముల దాటినది
నాబిజలజమై వెలిగేది
కళిడుం కుండ్రు అన్న పేరుతో
మణిపూరకమై వెలిసేది
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

హృదయ స్థానం కరిమలా
భక్తుల పాలిటి సిరిమలా
పంచప్రాణముల వాయువులే
శ్వాసనాళముల విలవిల
అనాహతం ఈ కరిమల
అసదృశం ఈ కరిమల
సాధకులకు ఇది ఘండశిల
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

నాదోంకార స్వరహారం
శరీరానికొక శారీరం
శబరిపాదమున పంపాతీరం
ఆత్మవిశుద్ధికి ఆధారం
ఆకాశానికి ఆరంభం
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

కనుబొమల మధ్య ఒక జీవకళ (ఓం)
ఆ జ్ఞాచక్రపు మిలమిల (ఓం)
చర్మఛక్షువులకందని అవధులు (ఓం)
సాధించే ఈ శబరిమలా
అదే కాంతిమలా
అదే కాంతిమలా
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప



Credits
Writer(s): Veturi, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link