Asmadeeya

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
వలపే ఇక తొలిపే చెలి ఒయ్యారంగా
కథలే ఇక నడిపే కడు శ్రుంగారంగా
పెనుగొండ ఎద నిండా రగిలింది వెన్నెలా... హలా
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆ ఆ... రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

(సాపమ సామగ సాగసనిపస)
(సాపమ సామగ సపగ గమప మపని పసనిప)
నీ పని, నీ చాటు పని, రసలీల లాడుకున్న రాజసాల పని
నా పని, అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని
రేపని మరి మాపని క్షణమాపని నా పని
ప ప ప పని పనిసగమని పని
మమ మని
మపనీ
ఆ పని ఏదో ఇపుడే తెలుపని
వలపని
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

(స ససస స నిస)
(స ససస స నిస)
(స ససస స నిస)
ఓ సఖి రాకేందుముఖి
ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖా మదనుని జనక
ఈ సందిట కుదరాలి మనకు సంధి ఇక
బుతువునకొక రుచి మరిగిన మన సైయ్యాటకి
మాటికి మొగమాటకు సగమాటలు ఏటికి
ప ప ప పని పనిసగమని మని
మమ మని
మ పని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి... వయసుకి
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆ ఆ... రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link